Thursday, 24 March 2016

సాయిబాబా ప్రేమ


"కఫినీ వస్త్రం లో కనిపించే ఓ శాంతి కపోతం
భక్తుల మదిలో నిక్షీప్తమైఉన్న ఓ సజీవ దేహం...
ఈ అనంత సముద్ర్రాలు , ఆకాశం , నక్షత్రాలు
సూర్య చంద్రులు అతని ఉనికి ...
అతడే విశ్వ కర్త , సృష్టి కర్త
సమస్త ప్రపంచాన్ని భక్తీ కైవల్య ఊయలలో
డోల లాడించే మాతృమూర్తి
ఆయనకు నటనంటే ఇష్టం , ఆటలంటే ప్రీతి
అవే అతని భక్తి పరీక్షా సాధనాలు
ఐశ్వర్యాన్ని చిరిగిన వస్త్రాలలో దాచుకున్న పరమయోగి ...
ప్రేమతోనే దండించగల కరుణా సముద్రుడు
ఏ రుచీ లేని ఆహారాన్ని తానూ భుజిస్తూ
షడ్రుచులనూ భక్తులకు ప్రసాదించగల కరుణా మూర్తి...
తాను కటిక  నేలపై పవలిస్తూభక్తులకు
 పసిడి తల్పాలను అనుగ్రహించాగల దయా హృదయుడు...
బాబా అన్న ఒక్క పిలుపు చాలు... తనతో బంధుత్వం కలుపుకోవడానికి
సాయి అన్న ఒక్క నామం చాలు... సమస్త పాపాలనూ ఒక్కసారిగా త్యజించడానికి
ఈ ప్రకృతిలో వృక్షాలకు , పూవులకూ ఒక వసంతం ఉన్నట్లే
మన జీవితంలోనూ వెలుగు నింపే ఒకే తియ్యని వసంతముంది
అదే బాబా ప్రేమ ...!!!”


శ్రీ సాయి దాస్
(సూర్య చవాకుల)

Wednesday, 16 March 2016

దత్తసాయి

"మహిమను చూపగ రావా దత్తసాయి
నా హృదయ మందిరమే నీకై వేచేనోయి.

ముచ్చటగొలిపే మూడు శిరములతో 
ఆశీర్వదించు ఆరు కరములతో.

డమ డమ మోగించు నీడమరుకాన్ని
తొలగించు సాయీ నాలో అజ్ఞానాన్ని.

ఫెల ఫెల ఝలిపించు నీ శూలాన్ని 
రెండుగా చేధించు నా చిత్తాన్ని.

కాషాయమే ధరించి , రుద్రాక్షలనే అలంకరించుకుని 
శునక రాజములే  బటులై నీవెంటరాగ 
ఒక్కసారి కనిపించు నా జన్మనే ధన్యం చేయగ...!!!"

చిన్ని అభ్యర్ధన

" నీ ముంగిట నిలిచా సాయి,
నా గుండెలలో  నీవే నిలవాలోయి.
నా పాపము నీ ధునిలో వేయి ,
నా భారము నీవే మోయి...!!!"

ప్రతి గురువారం నీకడ నిలిచా,
నాయద తలుపులు నీకై తెరిచా.
నా ప్రియనీస్తం నీవని తలచా,
కవి కోకిలనై నిను పిలిచా...!!!"

సాయి చరణం

" సాయి సాయి చరణం, 
జగతిలో సర్వపాపహరణం. 
సాయి సాయి వదనం, 
భువిలో ఏకైక ముక్తి మార్గం ...!!!"

"సాయి నామ మంత్రం,
ముక్తినొసగు తంత్రం .
సాయి నామ భజనం, 
దరికిచేర్చు స్వర్గం ...!!!"

కరుణ పంచు నయనం

" కరుణ పంచు నయనం....అభయమిచ్చు హస్తం 
ధైర్యమొసగు దరహాసం.... అలుముకున్న కాషాయంలో
సిరులుపంచు వదనం. 

నీవు ఏకాంతానికి దగ్గర, 
అయినా నీవంటే ప్రపంచానికి మక్కువ. 

నీవు అన్ని మతాలకు అతీతుడవు, 
మానవత్వపు ఆలయాన  ఒకే ఒక పూజారివి.

చిత్తమునే జయించిన తత్వవేత్తవు,
సృష్టికి ఆధ్యాత్మికత పులిమిన అపబ్రహ్మవు.

మాపాపాలు స్వీకరించు .... నీ భుజమున జోలితో
మా భయాలను పారద్రోలు నీ చటకాతో ...!!!" 

ప్రియబంధువు

" సాయినాధా ....సద్గురునాధా
పండరిపురా ....పాప వినాశా
వేదవిధూష .... సాధుస్వరూపా
షిరిడీ వాసా .... అనాధరక్షకా 

నా ప్రేమ సామ్రాజ్యాన నీవే రాజువి , నీవే మంత్రివి, నీవే బంటువి, 
నీవే తల్లివి , తండ్రివి. 
నీవే శిల్పం , నీవే కలశం 
నాయద కోవెలలో నీవే నా దైవం 
వయసున్న బాలుడవు  ,వైరాగ్య జీవుడవు 
సర్వం నీదే అయినా జోలి పట్టుకు తిరిగే భైరాగివి.
మసీదివాసివి , నిశీధిలో వేలుగురేఖవి
మాయను తొలగించి మమతను రుచిచూపే ప్రియబంధువువి...!!!"

Sunday, 6 March 2016

బాబా మా ప్రాణం

"బాబా బాబా మాఆశలన్నీ నీవీలే
బాబా బాబా మాప్రాణమంటే నీవేలే

నువ్వు అలక తీరువేల మేము  బుజ్జగించుకుంటాం
నువ్వు కునుకు తీయువేళ మేము నులకమంచమౌతాం
నువ్వు నడచువేల మేము  నీ పాదధూలిమౌతాం
నిను కొలుచువేల మేము తులసి తీర్థమౌతాం

నీ మోము పైన నవ్వు చెరగనీకు సాయి
ఈ జనులపై కరుణ తగ్గనీకు సాయి ...!!!"